BDK: భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన సాయి గౌతమ్(17) నలుగురు మిత్రులతో కలిసి ఈనెల 18న మేడారం సందర్శనకు వెళ్లాడు. తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగులో పడి యువకుడు మృతి చెందినట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.