WGL: పట్టణంలోని ఉర్సుగుట్ట సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకుడు రమేష్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం జీవితాంతం శ్రమించిన మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని అన్నారు.