BPT: నవంబర్ 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యలంక తీరంలో చేయాల్సిన ఏర్పాట్లపై ఇవాళ మున్సిపల్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యలంక తీరానికి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున భద్రత, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.