ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రూ. 5 రూపాయల నాణేలతో తయారు చేసిన మాలను అమ్మవారికి ధరించి ప్రత్యేక పూజలు చేశారు.