కోనసీమ: ముమ్మిడివరంలో శెట్టిబలిజ కళ్యాణ మండప నిర్మాణానికి తన వంతుగా నిధులు సమకూరుస్తానని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. టీడీపీ నాయకుడు గుత్తుల సాయి ఆధ్వర్యంలో మంగళవారం పాత కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. సమిష్టి కృషితో నిర్మాణం పూర్తి చేస్తామని నాయకులకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే పలువురు నాయకులను కలిశారు