కృష్ణా: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోదరుడు రామకృష్ణ కుమారుడు పృథ్వి జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం వద్ద వెనిగండ్ల కమ్యూనిటీ ఫ్రిడ్జ్‌ను ఏర్పాటు చేశారు. మాస్టర్ పృథ్వీతో కలిసి స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ శ్రీనివాసరావు కమ్యూనిటీ ఫ్రిడ్జ్‌ను మంగళవరం ప్రారంభించారు. ఫ్రిడ్జ్ ద్వారా పేదలకు కలిగే ప్రయోజనాలను, ఎటువంటి ఆహారాన్ని ఉంచాలో పృథ్వీ వివరించారు.