BHPL: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ కిరణ్ కారే అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా SP విధుల్లో అమరులైన పోలీసులకు పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.