అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ మృతి చెందారు. చిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్ అయిన డానియల్ గొప్ప ఆటగాడిగానే కాక, యూట్యూబ్ వంటి ఆన్లైన్ వేదికల ద్వారా చెస్ నేర్పించడంలో ప్రసిద్ధి చెందారు. అయితే, డానియల్ మరణానికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, ఆయన మృతి పట్ల ప్రపంచ గ్రాండ్ మాస్టర్లంతా సంతాపం తెలిపారు.