ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం దీపావళి పండగ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో శ్రీ సీతాదేవి అమ్మవారి ఉత్సవ మూర్తిని శ్రీ ధనలక్ష్మి దేవిగా ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.