KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు కుసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఇవాళ ప్రకటన ద్వారా తెలిపారు. బీటీ రోడ్డు నిర్మాణం పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని వారు తెలిపారు. మంత్రి పర్యటన విజయవంతం చేయాలని కోరారు.