కోనసీమ: ఐ.పోలవరం మండలం మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయానికి కార్తీక శోభ సంతరించుకుంది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 వరకు కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారని అధికారులు అంచనాలు వేస్తున్నారు. దానికి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు.