AP: రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ సుబ్బనాయుడు కన్నుమూశారు. నెల్లూరులో అనారోగ్యంతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సుబ్బనాయుడు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ ఆగ్రోస్ ఛైర్మన్గా ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.