KMR: పోచారం ప్రాజెక్టు తన శత వసంతాలు పూర్తి చేసుకుని, ఈ ఖరీఫ్‌లో భారీ వర్షాల కారణంగా 28.317 టీఎంసీల రికార్డు స్థాయి వరదను సురక్షితంగా తట్టుకుంది. కేవలం 1.820 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులోకి ఇంత భారీ వరద రావడం చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు. సోమవారం నాటికి కూడా ప్రాజెక్టులోకి 782 క్యూసెక్కుల వరద వస్తుందని డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు.