WGL: నర్సంపేటలో ఉద్యోగం ఇస్తానని రూ.22 లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘటన చోటుచేసుకుంది. గండిసాయి గణేష్ అనే యువకుడు ఎర్రబెల్లి శ్రావణ్, నిఖిల్, పాలేపు సందీప్‌ల నుంచి డబ్బులు తీసుకున్నాడు. శ్రీలంకకు తీసుకెళ్లి హోటల్లో కొన్ని రోజులు పనిచేయించి, ఆస్ట్రేలియాకు వెళ్లాక పత్రాలు పంపుతానని చెప్పి మోసం చేశాడు. బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.