BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈవో రవి నాయక్ తెలిపారు. ఈనెల 22 నుంచి నవంబరు 20 వరకు కొండకింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ప్రతిరోజు ఆరు విడతల్లో వ్రతాలు జరుగుతాయి. భక్తులు ఉదయం 7, 9, 11 గంటలకు, మధ్యాహ్నం 1, 3, 5 గంటలకు జరిగే వ్రతాలలో పాల్గొనాలని ఆయన కోరారు.