వరద బాధితులకు కేంద్రం ఆర్థిక సహాయం ప్రకటించడంపై మహారాష్ట్ర Dy. CM షిండే హర్షం వ్యక్తం చేశారు. మరఠ్వాడా వరద బాధితుల కోసం కేంద్రం రూ.1,566 కోట్లను ప్రకటించిందని చెప్పారు. కేంద్ర సహాయంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వరద బాధితులకు నష్ట పరిహారాన్ని వీలైనంత త్వరగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు.