NLG: నార్కట్ పల్లి మండలంలోని అక్కినేపల్లి గ్రామ ప్రధాన రహదారి ఇటీవల వర్షాలకు దెబ్బతింది. గుంతలమయమై ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందిగా మారింది. దీనిని గమనించిన యువకులు మర్రి దేవేందర్ యాదవ్, అక్కినేపల్లి సత్యనారాయణ తమ సొంత నిధులతో గుంతలను పూడ్చి ప్రయాణికులకు ఏర్పడిన అసౌకర్యాన్ని తొలగించారు. గ్రామస్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.