BPT: దీపావళి పండుగను పురస్కరించుకొని సోమవారం పిట్టలవానిపాలెంలో స్పీడ్ సైకిల్ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ హాజరై, పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు పాల్గొన్నారు. క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదపడతాయని వారు తెలిపారు. యువత ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీల్లో పాల్గొనాలని కోరారు.