ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గంలోని 100 మంది లబ్ధిదారులకు రూ. 54,50,093 సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పంపిణీ చేశారు. గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పేదవారు ఆరోగ్యంగా ఉంటేనే సీఎం చంద్రన్నకు ఆనందం అని చెప్పారు. ఆనారోగ్యంతో బాధపడే వారికీ ముఖ్యమంత్రి సహాయనిధి అనేది ఒక ఆపన్న హస్తం అన్నారు.