ELR: ఉమ్మడి ప.గో.జిల్లా కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్ రాజు, గెడ్డం రవీంద్రబాబు సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీలో చేరారు. సోమవారం ఏలూరు పార్టీ కార్యాలయంలో వారిని ఆహ్వానిస్తూ జరిగిన సభలో రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు మాట్లాడారు. ప్రపంచంలోనూ, దేశంలోనూ పరిణామాలు వేగంగా మారుతున్న పరిస్థితులలో విప్లవోద్యమం బలపడాలన్నారు.