KNR చొప్పదండి మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి పరిమిత సీట్ల గడువు తేదీని ఈనెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ కే.బ్రహ్మానందరెడ్డి తెలిపారు. 9వ, 11వ తరగతుల్లో మిగిలిన సీట్లకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8, 10వ తరగతులు చదువుతున్న ఉమ్మడి జిల్లా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.