MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 2022 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించింది. నిధులు కేటాయించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్మాణ పనులు కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు.