విశాఖలో ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు కానున్నాయి. సీఎం ఆదేశాల మేరకు 572 మందికి వివిధ కేటగిరీల్లో ప్రమోషన్లు సిద్ధం చేసినట్లు రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లు 27, మెకానికల్ సూపర్వైజర్లు 113, ఏడీసీలు 115, కండక్టర్లు గ్రేడ్-1 130, గ్రేడ్-1 డ్రైవర్లు 167 మంది ఉన్నారు.