SKLM: శ్రీకాకుళంలో అదనపు రద్దీని తగ్గించేందుకు భువనేశ్వర్-యశ్వంతపూర్-భువనేశ్వర్(02811/22) మధ్య స్పెషల్ ట్రైన్ ఈనెల 29వ తేదీ వరకు నడపనున్నట్లు తూర్పు ప్రాంత రైల్వే శాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖపట్నం-బెంగళూరు-విశాఖపట్నం(08581/82) మధ్య ఈనెల 30వ తేదీ వరకు రైళ్లు నడుస్తాయి. శ్రీకాకుళం రోడ్డు, పలాస స్టేషన్లలో ట్రైన్ ఆగనుంది.