KDP: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని కమాండెంట్ కే.ఆనంద రెడ్డి అన్నారు. సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలోని APSP 11వ పోలీసు బెటాలియన్లో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ పోలీసు అమరవీరుల స్మారక స్థూపానికి, పోలీసు అమరవీరుల చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు.