VKB: వికారాబాద్ పట్టణం నుంచి శబరిమల పాదయాత్రగా వెళ్ళే అయ్యప్ప మాలధారణ భక్తులకు కుల్కచర్ల శ్రీగురుకృప ఫంక్షన్ పుట్టపాడులో అల్పాహారంతో పాటు రాత్రి బసను ఏర్పాటు చేశారు. హిందూ ఉత్సవ సమితి సభ్యులు కంగారు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామి భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.