W.G: తణుకు మండలం తేతలి గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురు గాయపడ్డారు. సోమవారం రాత్రి దీపావళి పురస్కరించుకొని తలెత్తిన ఈ వివాదంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తణుకు రూరల్ ఎస్ఐ కె.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.