SRD: పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ పరిధి మైదానంలోని అమరవీరుల స్తూపానికి మంగళవారం ఎస్పీతో కలిసి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీసులు విధినిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తారని చెప్పారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు.