BHPL: రేగొండ మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ “కాంగ్రెస్ బాకీ కార్డులు” పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.