RR: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ముగ్గురు పిల్లల నిబంధనను తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం హర్షనీయమని నందిగామ మండల కాంగ్రెస్ సీనియర్ నేత బాల్ రెడ్డి మంగళవారం అన్నారు. మండలంలో నిర్వహించిన సమావేశంలో ఆయ మాట్లాడుతూ.. త్రీ చైల్డ్ పాలసీ రద్దు చేయడంవల్ల ప్రజాసేవ చేయాలనుకునే వారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కుతుందన్నారు.