KMM: పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా మంగళవారం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని పోలీస్ అమరవీరుల స్మారకస్థూపం వద్ద కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పుష్పగూచ్ఛం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. అన్ని విపత్కర సమయాలలో మొదటగా స్పందించేది పోలీసులే అని అంటూ వారి సేవలను కలెక్టర్ కొనియాడారు.