GNTR: నుదురుపాడు (ఫిరంగిపురం) వద్ద మంగళవారం పెను ప్రమాదం తప్పింది. గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై, ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయిన టాటా ఏసీ ఆటో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అతివేగం, వర్షం కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే, ఆటో డ్రైవరు, మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు.