KMR: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమైనవని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద SP నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరుల ఆశయాలను నెరవేర్చడం, వారి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేయడమే మనం వారికి అందించే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.