ASF: కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో దీపావళి పండుగ సందర్భంగా మంగళవారం నిర్వహించిన లక్ష్మీ పూజలో సిర్పూర్ MLA డా.పాల్వాయి హరీష్ బాబు పాల్గొని వ్యాపారస్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.MLA మాట్లాడుతూ లక్ష్మీదేవి కృప వలన నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా BJP అధ్యక్షులు శ్రీశైలం ఉన్నారు.