E.G: గోపాలపురం మండలం వెదులుకుంట గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు బొడ్డు వీర రాఘవులు ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి మంగళవారం పరామర్శించారు. పార్టీ బలోపేతానికి వీర రాఘవులు ఎంతో కృషి చేశారని, ఆయన లోటు తీర్చలేనిదని ఎంపీ అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఏఎంసీ ఛైర్మన్ బ్రహ్మ రాజు ఉన్నారు.