GDWL: కేటిదొడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో జరుగుతున్న పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఇవాళ స్వామివారికి సాంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తులకు అన్ని వసతులు కల్పించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అందరూ కలిసికట్టుగా జాతరను విజయవంతం చేయాలని కోరారు.