TG: విధి నిర్వహణలో వీర మరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ తెలిపారు. రూ. కోటి పరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల స్థలం అందిస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం చెల్లిస్తామని సీఎం పేర్కొన్నారు.