KDP: జమ్మలమడుగు దిగువపేటలోని సింగమల సుమంత్,తేజస్వినిలకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. కాగా 16వ తేదీన కడప రిమ్స్‌లో తేజస్విని మగ బిడ్డకు జన్మనిచ్చింది. భార్యాభర్తల మనస్పర్ధలతో గొడవపడి భర్త సుమంత్ 4 రోజుల బాబును ఆమె నుంచి తీసుకెళ్లాడు. కాగా తేజస్విని OP పోలీసువారిని ఆశ్రయించింది. భర్తకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి సోమవారం రాత్రి తేజస్వినికి బాబుని అప్పగించారు.