ATP: తాడిపత్రిలోని శ్రీ ధ్యాన శివుడి విగ్రహం ఆకట్టుకుంటోంది. విద్యుత్ దీపకాంతులు నడుమ శోభిల్లుతున్న భారీ విగ్రహం చూపరులను కట్టిపడేస్తోంది. పట్టణంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఈ మహాశివుడి విగ్రహాన్ని నెలకొల్పారు. ఇది తాడిపత్రిలోనే అతి పెద్ద విగ్రహం కావడం విశేషం. యువతీ, యువకులు శివుడి వద్ద ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.