CTR: వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళవారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు అవసరంలేకుండా బయటకు వెళ్లకుండా, నీటిముంపు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ తీగలు తెగి పడిన చోట్ల దరిచేరకూడదని తెలిపారు. చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు.