కృష్ణా: మొవ్వ మండలం నిడుమోలు గ్రామానికి చెందిన పలువురు మైనార్టీ నాయకులు టీడీపీని వీడి నిన్న వైసీపీలోకి చేరారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పార్టీ కండువా కప్పి వారిని వైసీపీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని కైలే అనిల్ కుమార్ తెలిపారు. వైసీపీకి ప్రజల్లో లభిస్తున్న ఆదరణకు ఈ చేరిక నిదర్శనమన్నారు.