HYD: దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తూ గాయపడిన బాధితులను ఎమ్మెల్యే మహమ్మద్ మజీద్ హుస్సేన్ మంగళవారం ఆసుపత్రిలో పరామర్శించారు. బాధితులకు త్వరగా మెరుగైన చికిత్స అందించాలని ఆయన డాక్టర్లను ఆదేశించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.