NLR: ఉదయగిరి నియోజకవర్గంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రేపు పర్యటిస్తారని I&PR కార్యాలయం నిన్న తెలిపింది. ఉదయం 11:30 గంటలకు వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని, ప్రజలతో సమావేశమవుతారు. అనంతరం దుత్తలూరు మండలం నర్రవాడలో శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానాన్ని సందర్శించనున్నట్లు వెల్లడించారు.