పై ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా సుండుపల్లె మండలం పింఛా ప్రాజెక్టులో మంగళవారం ఇన్ఫ్లో 1551 క్యూసెక్కులుగా ఉందని ప్రాజెక్టు ఏఈఈ నాగేంద్ర నాయక్ తెలిపారు. అవుట్ ఫ్లో 1640 క్యూసెక్కులుగా ఉందని తెలిపారు. చెయ్యేరు నది పరివాహక ప్రాంతంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు దాటవద్దని ఈతకు వెళ్లవద్దని హెచ్చరించారు.