GNTR: తాడేపల్లి జాతీయ రహదారిపై కుంచనపల్లి సమీపంలో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న ప్లాస్టిక్ ముడిసరుకు లోడు లారీ అదుపుతప్పి హైవే నుంచి సర్వీస్ రోడ్డులోకి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలు కాగా వాహనదారులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.