దీపావళి వేళ రాహుల్ గాంధీ ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా మిఠాయి దుకాణానికి వెళ్లారు. అక్కడ ఆయన సరదాగా స్వయంగా స్వీట్స్ తయారు చేశారు. ఈ క్రమంలో మరోసారి రాహుల్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. రాహుల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని, తన పెళ్లి కోసం ఎదురుచూస్తున్నామని, త్వరగా పెళ్లి చేసుకోవాలని షాప్ యజమాని సుశాంత్ జైన్ ఆయనకు సూచించారు. దీనికి రాహుల్ నవ్వుతూ స్మైల్ ఇచ్చారు.