కృష్ణా: కంచడం డొంక రోడ్డులో ఎస్సై ఎ. గణేష్ కుమార్ పోలీసు సిబ్బందితో కలిసి రహస్య సమాచారం మేరకు జూదం శిబిరంపై నిన్న దాడి చేశారు. గేమింగ్ యాక్ట్ 9(1) ప్రకారం జూదం ఆడుతున్న 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,250/ నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.