NDL: బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 23న మెగా జాబ్ మేళా జరగనుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ మేళాలో 10 కార్పొరేట్ కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. నియోజకవర్గ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.