కృష్ణా: పామర్రులోని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తన నివాసంలో మెడికల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిన్న సంతకం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని, సాధారణ కుటుంబాల విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని తెలిపారు. ప్రజల మద్దతుతో ఈ ఉద్యమం విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.