VZM: బొబ్బిలి మండలం రామన్నదొరవలస గ్రామంలో స్కూల్ ఆవరణ మురుగు నీటితో అధ్వానంగా తయారైంది. డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షపు నీరు స్కూల్ ముందే నిలిచిపోతోందని స్థానికులు తెలిపారు. విద్యార్థులు స్కూలుకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారని,అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు. ఈ సమస్యను ఇదివరకే మున్సిపల్ అధికారులకు తెలిపినా స్పందించలేదని వాపోయారు.